12th Fail Movie: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను డిమాండ్ చేస్తున్న నెటిజన్లు
రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన 12th ఫెయిల్ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చింది. మనోజ్ కుమార్ ఐపీఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని విధు వినోద్ చోప్రా డైరక్ట్ చేశాడు.
12th Fail Movie: ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన 12th ఫెయిల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతుంది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం మనోజ్ కుమార్ ఐపీఎస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. దర్శకుడు విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరో విక్రాంత్ మన్సే నటించారు. అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. హిందీలో సినిమా మంచి టాక్ సంపాదించుకోవడంతో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేశారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు అందరి హృదయాలను కదిలిస్తుంది.
థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా తాజగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డిసెంబర్ 29న స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా ఈ మూవీకి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ మూవీ హిందీ భాషలో మాత్రమే హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో చాలామంది నెటిజన్లు ఇతర భాషల్లో అంటే మలయాళం, బెంగాళి, గుజరాత్లో కూడా స్ట్రీమింగ్ తీసుకురావాలని హాట్‌స్టార్‌ను డిమాండ్ చేస్తున్నారు. కనీసం అప్డేట్ అయిన ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందో చూడాలి.