12th Fail Movie is the only Indian movie in IMDB top 50
12th Fail Record: ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన చిత్రం 12th ఫెయిల్(12th Fail). చిన్న సినిమాగా విడుదలై సంచలనమైన విజయాన్ని అందుకుంది. కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా ప్రేక్షకుల మనసు గెలిచిన చిత్రంగా, బెస్ట్ మోటివేటీవ్ చిత్రంగా నిలిచింది. ఇక ఓటీటీలో విడుదల అయిన తరువాత ప్రేక్షకులకు మరింత చేరువైంది. తాజాగా ఈ చిత్రం అరుదైన రికార్డును సృష్టించింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్‌లో(IMDB) టాప్ 50లో స్థానం సంపాదించుకుంది. భారతదేశం నుంచి ఈ లిస్ట్‌లో ఉన్న ఒకే ఒక చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ విషయంపై డైరెక్టర్ విధు వినోద్ చోప్రా స్పందించాడు. ఎంతో ఆనందంగా ఉందని ఈ క్షణం చనిపోయినా సంతోషమే అని తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ప్రపంచ సినిమాలను వెనక్కి నెట్టి టాప్ 50లో స్థానం సంపాదించుకున్న ఈ చిత్రంలో మనోజ్ పాత్రలో విక్రాంత్ మస్సె నటించారు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. 12వ తరగతి ఫెయిల్ అయిన మనోజ్ ఐపీఎస్ ఎలా సాధించాడు అనేది కథ. ఈ సినిమా రిజనల్ ఫిల్మ్ విభాగంలో ఇండిపెండెంట్‌గా ఆస్కర్ బరిలో పోటీపడుతుంది. ఈ చిత్రం యువతకు స్పూర్తి దాయకం అని బాలీవుడ్ యాక్టర్ బొమ్మక్ ఇరాని ప్రశంసించారు. ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఐఎమ్బీడీలో 9.2 రేటింగ్ సంపాదించడం విశేషం.