హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు మంచు మనోజ్ పేర్కొన్నాడు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘించడమే. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు గౌరవం ఇవ్వాలి. ఇలాంటి వ్యవహారశైలిని ఉపేక్షించవద్దు. వారిని అగౌరవ పరిచేలా చేసిన వ్యాఖ్యలకు.. ఆయన తరఫున నేను క్షమాపణ చెబుతున్నా’ అని పేర్కొన్నాడు.