సినీ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జనవరి 3కు విచారణ వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్నారు. కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీ బెయిల్ పిటిషన్ వేశారు. దానిపై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.