సినీ నటి సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్’. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అనారోగ్య సమస్యను గుర్తు చేసుకున్నారు. తన కష్ట సమయంలో ‘సిటాడెల్’ టీంను దేవుడు పంపాడని తెలిపారు. జీవితంలో కష్టాలు ఎదుర్కొనే సమయంలో దేవుడు తప్పకుండా సాయం చేస్తాడని పేర్కొన్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.