గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ OTT రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్ రూ.50 కోట్లకు దీని డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.