టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల, యువచంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్’. ఈ చిత్రం అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. అయితే, ఇవాళ సాయంత్రం 5 గంటలకు మూవీ ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు సాహిత్ మోత్కూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.