టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్‌లు దర్శకత్వం వహించారు.