TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. జూన్ 28లోపు విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసిందని.. కోర్టులో హాజరుకాకపోతే ప్రభాకర్ రావును నేరస్తుడిగా నాంపల్లి కోర్టు ప్రకటిస్తుందని పోలీసులు తెలిపారు. కాగా.. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన విషయం తెలిసిందే.