సత్యసాయి: మడకశిర మండలం చందకచర్ల గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.