TG: తెలంగాణ పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 30 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రెండు రోజుల క్రితం 77 మంది డీఎస్పీలు, అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డ విషయం తెలిసిందే.