VZM: రామనారాయణంలో శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా గురువారం శ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృత స్నపన, లక్ష తమలపాకులతో, సింధూరంతో సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నారాయణం నాగరత్నం, శ్రీ నారాయణం శ్రీనివాస్, నీరజవల్లి తదితరులు పాల్గొన్నారు.