MDK: హనుమాన్ జయంతి పురస్కరించుకొని గురువారం పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల మంజీరాతీరంలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకం సింధూర పూజలు నిర్వహించారు. అర్చకులు పార్థివ శర్మ ఆధ్వర్యంలో హనుమంతునికి మన్య సూక్త సహిత అభిషేకంతో మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు. అనంతరం భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.