అనకాపల్లి: ఆగస్టు 15 నుంచి 22 వరకు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నర్సీపట్నంలో నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ సూర్యచంద్ర తెలిపారు. గురువారం ఈ కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. సూర్యచంద్ర మాట్లాడుతూ.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రోజుకోక కార్యక్రమం చేపడుతున్నామన్నారు.