ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని పామూరు ఎంపీడీఓ బ్రహ్మయ్య తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు కిట్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. దీని ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలను వాట్సాప్లో సులభంగా పొందవచ్చన్నారు.