HYD: నాంపల్లి నిలోఫర్ ఆస్పత్రి ప్రాంగణంలోని పార్క్ స్థలంలో నిర్మాణాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు ఇవ్వలేదని, ఎవరి పేరు మీదైనా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని HYD కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పినా అనుమతుల విషయం అవాస్తవమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.