ADB: నేరడిగొండ మండలంలోని సావర్గావ్ గ్రామాన్ని గురువారం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సందర్శించారు. ఇంటింటా వెళ్లి జ్వరాలపై సర్వే నిర్వహించారు. అనంతరం రోగులకు సంబంధిత మందులను పంపిణి చేశారు. వేసవికాలం నేపథ్యంలో వర్షాలు పడుతుండగా ప్రజలు వివిధ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ రవీందర్ పాల్గొన్నారు.