తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘అమరన్’. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో ఆయన భార్య ఇందు రేబాక పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ముకుంద్ భార్య ఇందును తాను కలిశానని పల్లవి తాజాగా తెలిపింది. ఆమెతో ఎన్నో విషయాల గురించి మాట్లాడానని, పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ గురించి అవగాహన పొందానని పేర్కొంది.