మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ మూవీ ఇవాళ గ్రాండ్గా విడుదలైంది. ఈ మూవీని తమిళనాడు CM స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వీక్షించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని CM స్టాలిన్ ట్వీట్ చేశారు. ‘మూవీని చాలా ఎమోషనల్గా తెరకెక్కించారు. మేజర్ ముకుంద్, ఇందు రెబెక్కా పాత్రలను చక్కగా చూపించారు. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. దేశాన్ని రక్షించే మన సైనికులకు బిగ్ సెల్యూట్’ అంటూ రాసుకొచ్చారు.