మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అక్టోబర్‌లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మూవీలో ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్ హీరోయిన్గా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.