Indian Woman Are Expenditure 5 Thousand Crores On Makeup In Six Months
Indian Woman: ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది. మేకప్ (make up) లేనిదే జనం బయటకు రావడం లేదు. ఇంట్లోనే మేకప్ కిట్స్ ఉంటున్నాయి. కొంచెం డబ్బు ఉంటే చాలు పార్లర్కి వెళ్లి మరీ మేకప్ వేసుకుంటున్నారు. అయితే భారతీయ మహిళలు, యువతులు 6 నెలల్లో మేకప్ (make up) కోసం భారీగా నగదు వెచ్చించారట. అవును కేవలం ఆరు నెలల్లో 5 వేల కోట్ల ఖర్చు చేశారనే కఠోర నిజం తెలిసింది.
దేశంలోని 10 నగరాల్లో ఇంత మొత్తంలో ఖర్చు చేశారట. 100 మిలియన్లకు పైగా లిప్ స్టిక్, నెయిల్ పాలిష్, ఐ లైనర్స్ వంటివి కొనుగోలు చేశారని గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 40 శాతం మేర ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేశారని కాంతర్ వరల్డ్ ప్యానల్ నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం సగటున ఒక్కొక్కరు 6 నెలల్లో రూ.1214 ఖర్చు చేశారని తెలుస్తోంది.
వీటిలో అత్యధికంగా లిప్ స్టిక్స్ (lip stick) ఉన్నాయి. 38 శాతం ఖర్చు లిప్ స్టిక్ కోసం చేశారట.. తర్వాత స్థానంలో నెయిల్ ఉత్పత్తులు ఉన్నాయి. వయసు ఎక్కువ ఉన్న వారు లిప్ స్టిక్, నెయిల్ పాలిష్ కోసం చూస్తే.. యువత ప్రీమియర్ లిప్ బామ్ కొనుగోలు చేసింది. 3 నెలల్లో లక్షా 50 వేల మేకప్ కిట్స్ విక్రయాలు జరిగాయని షాపర్స్ స్టాప్ పేర్కొంది. కాస్మొటిక్ మార్కెట్లో వర్కింగ్ ఉమెన్ పాత్ర ఎక్కువగా ఉంది. సౌందర్య సాధనాలను ఎక్కువగా వారే కొనుగోలు చేస్తున్నారని తేలింది.