Memory power: ఇలా చేస్తే జ్ఞాపకశక్తి ఈజీగా పెరుగుతుంది!
ఒక వ్యక్తి మెదడు అభివృద్ధిలో యోగా(yoga) చాలా కీలక పాత్రను పోషిస్తుంది. అయితే మెదడును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జ్ఞాపకశక్తి,(memory power) ఏకాగ్రతను మెరుగుపరచడం చాలా ముఖ్యం. దీంతోపాటు అల్జీమర్స్ వంటి మానసిక రుగ్మతలను నివారించుకోవడానికి ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.
యోగా (yoga) అనేది శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా నిరూపితమైన పరిష్కారం. యోగాతో మీరు మంచి శ్రేయస్సు, మీ జీవిత నాణ్యతకు గొప్ప విలువను జోడించుకోవచ్చు. యోగాలో పలు రకాల ఆసనాలు వేయడం ద్వారా మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తి స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ విధంగా కొన్ని రోజులు చేయడం ద్వారా మీ శరీరంలోని మెదడు చురుకుగా పనిచేసి మీరు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని అన్నారు. వయస్సు, లింగం, ఫిట్నెస్ స్థాయిలతో సంబంధం లేకుండా యోగా ఎవరైనా చేయవచ్చని చెప్పారు. పురాతన శాస్త్రం మెదడు పనితీరును పెంచే డైనమిక్ ప్రక్రియ యోగా అని తేలింది. అయితే ఎటువంటి ప్రక్రియల ద్వారా మన మెదడు పనితీరును పెంచుకోవచ్చు? అది ఎలా అనేది ఇప్పుడు చుద్దాం.