Useful Tip: షాంపూ తర్వాత కండిషనర్ వాడుతున్నారా..? ఎలా వాడాలో తెలుసా?
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు సార్లు హెయిర్ వాష్ చేయాలి. షాంపూ తర్వాత, కండిషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. కండిషనర్ జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తుంది.
Useful Tip: మహిళలకు జుట్టు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు వారికి ఒక ఆస్తి. అందుకే చాలా మంది మహిళలు హెయిర్ కేర్ ని పాటిస్తూ, తమ జుట్టును శుభ్రంగా, మృదువుగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు సార్లు హెయిర్ వాష్ చేయాలి. షాంపూ తర్వాత, కండిషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. కండిషనర్ జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తుంది.
జుట్టుకు మాత్రమే ఉపయోగించండి: తలకు కండీషనర్ అప్లై చేయవద్దు. దీని వల్ల జుట్టు మూలాలు దెబ్బతింటాయి, జుట్టు సమస్యలు వస్తాయి.
కొద్దిసేపు ఉంచండి: కండీషనర్ అప్లై చేసిన వెంటనే కడగకండి. 2 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.
అతిగా వాడకండి: ఎక్కువ కండీషనర్ ఉపయోగిస్తే జుట్టు బలహీనంగా మారి, రాలిపోతుంది.
సరైన కండీషనర్ ఎంచుకోండి: మీ జుట్టు రకానికి సరిపోయే కండీషనర్ ఎంచుకోండి. డాక్టర్ లేదా బ్యూటీ ఎక్స్పర్ట్ సలహా తీసుకోవచ్చు.
హెర్బల్ కండీషనర్ ఉపయోగించండి: సహజ పదార్థాలతో తయారు చేసిన హెర్బల్ కండీషనర్లు మంచివి.
ఈ చిట్కాలు పాటిస్తే మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా మెరుస్తూ ఉంటుంది.