Winter Season: చలికాలంలో పగిలిన పెదాలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇదిగో పరిష్కారం..!
చలికాలంలో ఎక్కువ మంది పగిలిన పెదాల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పెదాలు పగిలి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే, ఈ కింది ట్రిక్స్ ఫాలో అయితే.. ఆ పగిలిన పెదాల సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఓసారి చూద్దాం..
కలబంద:
పగిలిన పెదవులకు కలబంద చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
కలబంద గుజ్జును పెదవులకు రాసి అరగంట పాటు ఆరనివ్వండి.
ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
వెన్న:
పెదాల పగుళ్లకు వెన్న చాలా మంచిది.
ఒక చెంచా వెన్నకు చిటికెడు పంచదార కలిపి పెదవులకు మృదువుగా స్క్రబ్ చేయండి.
ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా మారతాయి.
తేనె:
తేనెలో యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.
రెండు చుక్కల తేనెను పెదవులపై రాసి మృదువుగా మర్దనా చేయండి.
రోజుకు రెండుసార్లు చేస్తే పెదవులు పగుళ్లు తగ్గుతాయి.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె పెదవులకు మంచి మాయిశ్చరైజర్.
రోజుకు రెండుసార్లు పెదవులకు కొబ్బరి నూనె రాస్తూ ఉంటే పగుళ్లు తగ్గుతాయి.
నువ్వుల నూనె:
నువ్వుల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.
కాస్త నువ్వుల నూనెను వేళ్లకు రాసుకొని పెదవులకు మృదువుగా మర్దనా చేయండి.
రోజుకు రెండుసార్లు చేస్తే పెదవులు పగుళ్లు తగ్గుతాయి.
ఇతర చిట్కాలు:
పెదవులను తరచుగా నాలుకతో తాకకూడదు.
పెదవులకు లిప్ బామ్ వాడండి.
శరీరానికి తగినంత నీరు తాగండి.
పొగతాగడం మానుకోండి.
పోషకమైన ఆహారం తినండి.
గమనిక:
ఈ చిట్కాలు అందరికీ పనిచేస్తాయని హామీ ఇవ్వలేము. మీకు ఏదైనా అలెర్జీలు ఉంటే ఈ చిట్కాలు వాడే ముందు వైద్యుడిని సంప్రదించండి.