Wearing cap: క్యాప్ పెట్టుకుంటే బట్టతల నిజంగా వస్తుందా?
సాధారణంగా ఎవరైనా గుండు చేయించుకున్నా లేదా స్టైల్ కోసం అనేక మంది క్యాప్స్ ఉపయోగిస్తారు. అంతేకాదు ప్రస్తుతం చలి ఎక్కువగా ఉందని కూడా పలువురు టోపీలను తలపై ధరిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా క్యాప్ ఉపయోగించడం వల్ల బట్టతల వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చుద్దాం.
మనలో కొందరు టోపీలు ఎక్కువగా ధరించడం వల్ల బట్టతల వస్తుందని భావిస్తారు. కానీ ఇలాంటి కారణాల వల్ల బట్టతల వచ్చే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు. టోపీని పెట్టుకోవడం లేదా తీయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. కానీ మీ టోపీ బిగుతుగా ఉంటే అది మీ హెయిర్ ఫోలికల్స్కి గాలి, రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుందని అంటున్నారు. అటువంటి టోపీలను ధరించకూడదని సూచిస్తున్నారు. అయినప్పటికీ దానికదే బట్టతల వచ్చే అవకాశం లేదని అన్నారు.
బిగుతుగా ఉండేవి తలకు ధరిస్తే
అయితే అనేక సార్లు మహిళలు లేదా పురుషులు బిగుతుగా ఉండే బన్స్, పోని టైల్స్ ధరించడం వల్ల జుట్టు రాలే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. హెయిర్ ఫోలికల్స్ చాలా కాలం పాటు లాగబడినప్పుడు, జుట్టు ఎత్తైన పోనీటైల్, కార్న్రోస్ లేదా బ్రెయిడ్లలో ఉన్నప్పుడు జుట్టు రాలడం జరుగుతుందన్నారు. డై లేదా రిలాక్సర్తో రసాయనికంగా చికిత్స చేయబడిన జుట్టు ప్రధానంగా ఈ రకమైన నష్టానికి గురవుతుందని చెప్పారు. అంతేకాదు ట్రాక్షన్ అలోపేసియా అనేది నెలల తరబడి జుట్టును వ్రేలాడదీయడం లేదా డ్రెడ్స్లో ధరించే వ్యక్తులలో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుందని చెప్పారు.
హస్తప్రయోగం వల్ల జుట్టు రాలుతుందా?
జుట్టు రాలడానికి కొంత మంది హస్త ప్రయోగం కూడా కారమని భావిస్తారు. అయితే ఇందులో నిజం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొంత మంది మాత్రం టెస్టోస్టెరాన్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ (DHT)లోకి జీవక్రియ చేయబడినప్పుడు ఈ రకమైన జుట్టు రాలడం జరుగుతుందన్నారు. ఇది వెంట్రుకలలోని ఆండ్రోజెన్ గ్రాహకాలతో సంకర్షణ చెందుతుంది. ఇది హెయిర్ ఫోలికల్ యొక్క సూక్ష్మీకరణను ప్రేరేపిస్తుంది. మినీ హెయిర్ ఫోలికల్స్ సన్నగా, చిన్నగా, చిన్న వెంట్రుకలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి సాధారణ వెంట్రుకల కంటే నెమ్మదిగా పెరుగుతాయి. సులభంగా బయటకు తీయబడతాయన్నారు.
DHT ప్రభావంతో జన్యుపరంగా కుంచించుకుపోయే అవకాశం ఉన్న హెయిర్ ఫోలికల్స్ కొంతమందికి మాత్రమే ఉంటాయి. జుట్టు రాలడానికి సంబంధించి 250కి పైగా జన్యుపరమైన కారణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. బట్టతల స్థితి మీ తల్లి వంశం నుంచి మీకు సంక్రమించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మీ అమ్మ, ఆమె తల్లిదండ్రులు జీవితాంతం జుట్టుతో నిండి ఉనప్పటికీ, మీరు ఇప్పటికీ బట్టతలని పలు రకాల కారణాలతో అనుభవించవచ్చని కూడా అంటున్నారు.