ప్రస్తుత జీవనశైలి కారణంగా చాలామందికి జుట్టు విపరీతంగా రాలుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న జుట్టు సమస్య అయితే రోజురోజుకి పెరుగుతుంది. ఈ చిట్కా పాటించి జుట్టు రాలే సమస్యను తగ్గించుకోండి.
జట్టు రాలకుండా ఉండాలంటే కురులకు ఆయిల్ మసాజ్ తప్పనిసరి. నూనెను జుట్టు కుదుళ్లకు పట్టించి, ఒక పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు మసాజ్ చేస్తే రక్తప్రసరణ జరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
రోజూ మీరు ఉపయోగించి నూనెతో జుట్టుకి మసాజ్ చేయవచ్చు. లేదా మసాజ్ ఆయిల్ని తయారు చేసుకుంటే జుట్టు పెరుగుదల ఇంకా తొందరగా ఉంటుంది. మీరు ఉపయోగించే నూనెతో పాటు కొబ్బరి నూనె, ఆలివ్, ఆముదం నూనెను తీసుకోవాలి. నూనెను గోరువెచ్చగా వేడి చేసి అందులో కరివేపాకు, మెంతులు, మందార పువ్వు వేసి రాత్రంతా వదిలేయాలి. తర్వాతి రోజు ఆ నూనెను వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తలస్నానం చేసే ముందు రోజు రాత్రి తలకు పట్టించి మసాజ్ చేస్తే జుట్టు బలంగా ఉంటుంది.
విటమిన్-ఈ క్యాప్సిల్స్
మసాజ్ ఆయిల్లో విటమిన్-ఈ క్యాప్సిల్స్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి, రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే కురులు ఒత్తుగా పెరుగుతాయి.