ప్రస్తుతం చాలామందికి జుట్టు తెల్లగా మారిపోతుంది. మారిన జీవనశైలి, ఒత్తిడి వాటివల్ల ఈరోజుల్లో చాలామంది సమస్యతో బాధపడుతున్నారు. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
Hair Tips: జుట్టు నల్లగా మారాలంటే రోజూ తలకి నూనె అప్లై చేసి.. మసాజ్ చేయాలి. తక్కువ కెమికల్స్ ఉండే హెయిల్ ప్రొడక్ట్స్ ఉపయోగించాలి. సహజంగా ఇంట్లో ఉండే పదార్థాలతో హెయిర్ ప్యాక్ వేసుకోవాలి. కొబ్బరి నూనె, ఆముదం, నువ్వుల నూనెలను గోరువెచ్చగా చేసుకోవాలి. దీనిని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. తెల్లజుట్టును తగ్గించేందుకు హెన్నా, గోరింటాకు వంటివి ఉపయోగించవచ్చు. పచ్చి పసుపును జుట్టుకు అప్లై చేసిన తెల్ల జుట్టు మాయం అవుతుంది. కొబ్బరి లేదా ఆవాల నూనెలో పసుపు, విటమిన్ ఇ క్యాప్యూల్స్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి బాగా మర్దన చేయాలి. తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది.