చుండ్రుకు కారణాలు
వాతావరణ మార్పులు
హార్మోన్ల మార్పులు
జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం
జుట్టు ఆరకముందే జడ వేసుకోవడం
చుండ్రును తగ్గించడానికి కొన్ని చిట్కాలు
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్లో యాంటీ ఫంగల్ గుణాలు ఉండడం వల్ల చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను తొలగిస్తుంది. కొబ్బరి, ఆలివ్ ఆయిల్ వంటి క్యారియర్ ఆయిల్లో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయండి. దీన్ని గంట పాటు ఆరనిచ్చి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.
యాపిల్ సైడర్ వెనిగర్
యాపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ pHని సమతుల్యం చేస్తుంది. ఇది చుండ్రు పెరుగుదలకు దోహదపడే ఈస్ట్ పెరుగుదలను తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్, నీళ్లను సమాన భాగాలుగా తీసుకుని మిక్స్ చేయండి. దీన్ని తలకు అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చే తలస్నానం చేయండి.
కలబందలో సీథింగ్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల చుండ్రు వల్ల కలిగే దురద, పొట్టును తగ్గిస్తుంది. తాజా కలబదం గుజ్జును తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. దీన్ని 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత సున్నితమైన షాంపూతో తలస్నానం చేయండి.
పెరుగు, నిమ్మరసం
పెరుగు, నిమ్మరసం చుండ్రును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. నాలుగు టేబుల్స్పూన్ల హెన్నా పొడిలో రెండు టేబుల్స్పూన్ల నిమ్మరసం వేసి కలపాలి. ఆపై ఆ మిశ్రమంలో పెరుగు వేస్తూ పేస్ట్ అయ్యేంత వరకు ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్త్లె చేసుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.