Women Applying To Bill Gates's Office Were Asked Objectionable questions
Bill Gates: ప్రపంచంలోనే నాలుగవ ధనవంతుడు బిల్ గేట్స్ (Bill Gates) ఆఫీసుపై మహిళలు సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్వ్యూ కోసం పిలిచి అభ్యంతరకర ప్రశ్నలు వేశారని చెబుతున్నారు. ‘తాను బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశానని తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా సెక్యువల్ హిస్టరీ, పోర్నోగ్రఫీ గురించి అడిగారు అని’ బాంబ్ పేల్చారు. ఆమె చేసిన కామెంట్లను వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో రాసింది. బిల్ గేట్స్ (Bill Gates) ఆఫీసుపై మహిళా చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
డ్రగ్స్ తీసుకున్నారా..? ఇదివరకు వివాహేతర సంబంధం ఉన్నాయా అని కూడా అడిగారట. బిల్ గేట్స్ ప్రైవేట్ ఆఫీసు ఇంటర్వ్యూను థర్డ్ పార్టీ కంపెనీ నిర్వహిస్తోంది. కొందరినీ అశ్లీల చిత్రాలు చూసేందుకు ఇష్టపడతారా..? ఫోన్లలో నగ్న చిత్రాలు ఉన్నాయా అనే విషయాలను అడిగినట్టు పేర్కొంది. మీరు డాలర్స్ కోసం డ్యాన్స్ చేశారా అని కూడా అడిగారట. లైంగికంగా సంక్రమించే వ్యాధి మీకు వచ్చిందా అని కూడా కొశ్చన్ చేశారట. పురుషులను లైంగిక జీవితం గురించి అడిగే అవకాశం ఉందని పేర్కొంది. కానీ దరఖాస్తు చేసిన వారు అలాంటి ప్రశ్నలను మాత్రం ఎదుర్కొనలేదు.
గేట్స్ ప్రైవెట్ ఆఫీసులో ఇంటర్వ్యూల కోసం ఇలా కొశ్చన్స్ చేస్తున్నారని బయటకు రావడంతో అతని ఆఫీసు స్పందించింది. అభ్యర్థులకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారని తమకు తెలియదని పేర్కొంది. ఇలాంటి కొశ్చన్స్ వేయడం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. తమ కంపెనీతో ఆ కాంట్రాక్టర్ ఒప్పందాన్ని ఉల్లించారని తెలిపింది. అంతే తప్ప కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటాం అని కానీ, ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయలేదు.