నేడు సూర్య గ్రహణం. భూమికి సూర్యుడికి మధ్యలోకి చంద్రుడు వచ్చినప్పుడు ఈ సూర్య గ్రహణం ఏర్పడుతుంది. కాగా… భారత్ లో 5 గంటల ఒక నిమిషం నుంచి 6 గంటల 26 నిమిషాల దాకా సూర్య గ్రహణం ఉంటుంది. 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అరుదైన గ్రహణం(solar eclipse) ఇది. కారణంగా పలు ఆలయాలను మూసి వేశారు.
ఈ సంవత్సరంలో ఇది రెండోది కావడం గమనార్హం. ఇది వరకు ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తొలి సూర్యగ్రహణం సంభవించింది. ఈ సంవత్సరం మొత్తంగా నాలుగు గ్రహణాలు ఏర్పడబోతోన్నాయి. సూర్య, చంద్ర గ్రహణాలు రెండు చొప్పున రానున్నాయి. వచ్చే నెల నవంబర్ 7, 8 తేదీల్లో చంద్రగ్రహణం రాబోతోంది.
సాయంత్రం వేళల్లో గ్రహణం ఏర్పడుతుండటంతో మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి 9 గంటల 39 నిమిషాల వరకూ ఆహార నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాగా గ్రహణం టైమ్ దగ్గర పడుతుండటంతో హైదరాబాద్ సిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ జనం బయటతిరగకపోవడంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సూర్య గ్రహణం నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఆలయం మాత్రం దీనికి మినహాయింపు.