మా దేశంపై విదేశీ దాడులు జరిగితే మాత్రం రష్యా (Russia) నుంచి తీసుకొన్న అణ్వాయుధాలను ప్రయోగించడానికి ఏమాత్రం వెనుకాడమని బెలారస్ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ లుక షెంకో (Alexander Lukashenko) గట్టి వార్నింగ్ ఇచ్చాడు.నాటో దళాల మోహరింపులతో సరిహద్దులు ఉద్రిక్తంగా మారియి. తాజాగా బెల్టాతో లుకషెంకో మాట్లాడుతూ ఉక్రెయిన్ (Ukraine)సేనలు హద్దులు దాటనంత వరకూ తమ దేశం ఈ యుద్ధంలో భాగస్వామి కాదని తెలిపారు. కానీ, తమ మిత్రదేశమైన రష్యాకు మాత్రం సాయం చేయడం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఒక వేళ నాటో దేశాలైన పోలాండ్, లిథువేనియా, లాత్వియా వంటి దేశాలు కవ్విస్తే మాత్రం బెలారస్ (Belarus) తన వద్ద ఉన్న అణ్వాయుధాలతో సహా సర్వశక్తులతో స్పందిస్తుందన్నారు. అంతేకానీ, తాము భయపడి దాక్కోవడం, ఎదురు చూడటం వంటివి చేయమని అన్నారు.
‘‘మేము ఎవరినో బెదిరించడానికి ఇక్కడికి అణ్వాయుధాలు తీసుకురాలేదు. కానీ, అవి ప్రత్యర్థులను బాగా భయపెడతాయన్నది వాస్తవం అన్నారు. ఇవి చిన్న అణ్వాయుధాలే(Nuclear weapons).. పెద్దవికాదు. అందుకే మాపై దాడి మొదలుపెట్టిన తక్షణమే వాటిని వాడతాం’’ అని తెలిపారు.ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో బెలారస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దేశాన్ని మాస్కో ఓ లాంఛ్ప్యాడ్గా వాడుకొంటోంది. గతేడాది రష్యా దళాలతో కలిసి సేనలు యుద్ధ విన్యాసాలు చేశాయి. అప్పుడే ఇవి కూడా ఉక్రెయిన్పై దాడిలో భాగస్వాములవుతాయని అందరూ భావించారు. ఈ ఏడాది జూన్లో రష్యా నుంచి కొన్ని అణ్వాయుధాలను రక్షణ కోసం బెలారస్కు తరలించారు. ఈ విషయాన్ని వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) స్వయంగా ప్రకటించారు. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంచనా ప్రకారం ఒక వేళ బెలారస్లో అణ్వాయుధాలున్నా.. వాటిపై లుకషెంకో నియంత్రణ ఉండదు.. పూర్తిగా రష్యా ఆధీనంలోనే ఉంటాయి.’