»Water Bottle There Are So Many Lakhs Of Plastic Particles In A Liter Bottle
Water Bottle: లీటర్ బాటిల్లో ఇన్ని లక్షల ప్లాస్టిక్ రేణువులా!
సాధారణంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగడం మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటినే ఎక్కువగా వాడుతుంటారు. ప్లాస్టిక్ బాటిల్లోని నీటిలో ఎక్కువగా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తెలుసు.. కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో మీకు తెలుసా? ప్లాస్టిక్ వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగడం మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటినే ఎక్కువగా వాడుతుంటారు. ఇందులోని నీటిలో ఎక్కువగా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తెలుసు.. కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఒక లీటరు బాటిల్లో సరాసరిగా 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగడం వల్ల అవి నేరుగా మన రక్తంలో ప్రవేశించి రకరకాల సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇదివరకు చేసిన అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్‌లు సుమారు అయిదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. కానీ ఈ అధ్యయనాల్లో ఇంతకు ముందు అంచనా వేసిన దానికంటే వందరెట్లు ఉండవచ్చని తెలిపారు. మైక్రోప్లాస్టిక్‌లు కంటే రేణువుల్లా ఉండే నానో ప్లాస్టిక్లు చాలా ప్రమాదకరమైనవి. పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ను గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. అయితే ఈ మైక్రోప్లాస్టిక్‌లు నేల, తాగునీరు, ఆహారం, చివరికి ధ్రువ ప్రాంతాల్లోని ఐస్‌లో కూడా ఉన్నట్లు సమాచారం.
ఇవి శరీరంలోకి వెళ్లడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి శోధించడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి ఏటా 400 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరువవుతోందట. ఏటా 30 మిలియన్ టన్నుల కన్నా ఎక్కువగా నేల లేదా నీటిలో పారేస్తున్నారు. సింథటిక్ వస్త్రాలు సహా ప్లాస్టిక్‌తో తయారైన అనేక పదార్థాలు వినియోగంలో ఉండగానే సూక్ష్మరేణువులను విడుదల చేస్తుంటాయి.