ఓ ఐల్యాండ్‌లో ఓ భాగం అచ్చం డాల్ఫిన్ తలను పోలి ఉంది. ఓ ఫోటోగ్రాఫర్ క్లిక్ అనిపించి, ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది ఆ పిక్ తెగ వైరల్ అవుతుంది.
Photo Shows Harbour In UK That Appears Like Dolphin's Head, Internet Amazed
Dolphin’s Head: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదిగా మారిపోయింది. ఎక్కడెక్కడి వింతలు, విశేషాలు వెంటనే తెలిసిపోతున్నాయి. తాజాగా ఓ ఫోటోగ్రాఫర్ (Photograper) ఓ ఐల్యాండ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది అది వైరల్ అవుతోంది. ఆ ఐల్యాండ్ అచ్చం డాల్ఫిన్ ముఖంలా (Dolphin’s Head) ఉంది.
Rhy Jones అనే ఫోటో గ్రాఫర్ (Photograper) ఈ ఫోటోని (photo) షేర్ చేశాడు. తాను Pwllheli నౌకాశ్రయానికి చాలాసార్లు వెళ్లానని, దాని ప్రత్యేక ఆకృతిని ఇంతకు ముందు గుర్తించలేదని చెప్పాడు. ఫోటోను Pwllheli Drone Photos అనే Facebook ఫోరమ్‌లో పోస్ట్ చేశారు. వేల్స్ తీరప్రాంతం నమ్మశక్యం కానీ వన్యప్రాణులతో నిండి ఉంది. డ్రోన్ షార్ట్‌లో (Drone) అది అచ్చం డాల్ఫిన్ ముఖంలా కనిపించింది. ఇలా అందరికీ తెగ నచ్చేస్తోంది.
“నేను చాలా సార్లు మెరీనా పైన ఉన్నాను, నేను దీనిని గమనించడం ఇదే మొదటిసారి. ఇది అద్భుతం. మీరు దీన్ని ఒకసారి చూస్తే, మళ్లీ.. చూడకుండా ఉండలేరు” అని మిస్టర్ జోన్స్ తెలిపాడు. డ్రోన్ షాట్లో ఈ ఫోటో తీశానని వివరించారు. కేవలం డాల్పిన్ ముఖం ఆకారంలో ఉండటమే కాదు, చుట్టూ పరిసరాలు, ఆ ఫోటో (photo) చాలా అందంగా ఉన్నాయి. ఆ ఫోటో చూసినప్పుడల్లా ఆ ప్రాంతానికి వెళ్లాలి అనే అనుభూతి కలుగుతుంది.