»Passenger Air Taxi Ready Only Two Of Them Can Travel
Flying Air Taxi : ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీ రెడీ..అందులో ఇద్దరికి మాత్రమే ప్రయాణం!
త్వరలోనే ఎయిర్ ట్యాక్సీలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ ట్యాక్సీల వినియోగం విపరీతంగా పెరగనుంది. చైనాకు చెందిన ఓ కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీకి 1200 ఆర్డర్ల వరకూ వచ్చాయి.
టెక్నాలజీ (Technology) కొత్త పుంతలు తొక్కతోంది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఆవిష్కరణలు రూపాంతరం చెందుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటి వరకూ రోడ్లపై తిరిగే ట్యాక్సీలను చూశాం. ఇకపై గాలిలో తిరిగే ట్యాక్సీలను (Air Taxi) చూడబోతున్నాం. ప్రపంచంలోనే పలు దేశాల్లో ఎయిర్ ట్యాక్సీలు వినియోగంలోకి రానున్నాయి. తొలిసారి ఈ ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీలను వాడుకలోకి తీసుకురానున్నారు. ఈ ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా (China) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చైనాలో ఇకపై ఈ ఎయిర్ ట్యాక్సీలో అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు. ఇద్దరికి వీలుగా సామర్థ్యం గల ఈ ఎయిర్ ట్యాక్సీకి చైనా ప్రభుత్వం వాడుకలోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ముందుగా భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రం ఇవ్వనుంది. ఎహంగ్ అనే చైనా కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేసి విక్రియించనుంది.
అతి త్వరలో ఈ ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి. అందుకోసం ఎహంగ్ కంపెనీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాబోయే 5 సంవత్సరాలలో ఈ ఎయిర్ ట్యాక్సీలు అనేక నగరాల్లో కనిపించనున్నాయని ఎహంగ్ కంపెనీ సీఈవో హుయాజీ హు వెల్లడించారు. ఈ ట్యాక్సీలను అనేక రంగాల్లో వినియోగించనున్నారని, ఇప్పటికే తమ కంపెనీకి 1200 ఆర్డర్లు వచ్చినట్లుగా ఆయన తెలిపారు. ఈ ఎయిర్ ట్యాక్సీల వల్ల ట్రాఫిక్ కష్టాలు ఉండవని, సుదూర ప్రాంతాలకు సైతం క్షణాల్లో చేరుకుంటారని ఆయన వెల్లడించారు.