»Pakistan Leader Maulana Fazlur Rehman Praised India Dreaming Of Becoming Superpower
Pak : భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే మనం అడుక్కుతింటున్నాం అన్న పాక్ నేత
పాకిస్థాన్ పార్లమెంటులో భారత్ గురించి అక్కడి నేత ఒకరు ప్రశంసిస్తూ మాట్లాడారు. భారత్‌ను పోలుస్తూ పాక్ స్థితిని దుయ్యబట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
Pak Leader: ‘ఒకే సారి స్వాతంత్రం వచ్చిన దేశాలు భారత్, పాకిస్థాన్‌లు. భారత్ ఓ వైపు సూపర్ పవర్‌గా ఎదగాలని కలలు కంటూ ముందుకు వెళుతుంటే మరో వైపు పాకిస్థాన్ అడుక్కుతింటోంది’ అంటూ ఓ పాక్ నేత మౌలానా ఫజ్లూర్ రెహ్మాన్(Maulana Fazlur Rehman) అన్నారు. పాక్ నేషనల్ అసెంబ్లీలో జమాత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్ పార్టీ నేత అయిన ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
పాక్ నేషనల్ అసెంబ్లీ వేదికగా భారత్‌ను పోలుస్తూ పాక్ పరిస్థితిపై రెహ్మాన్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు అక్కడున్న సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భారత్(India) సూపర్ పవర్ గా(Superpower) ఎదుగుతుంటే పాక్ మాత్రం దివాలా నుంచి బయట పడేందుకు ఐఎంఎఫ్‌ను అడుక్కుంటోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ఇస్లాం మతం ఆధారంగా ఏర్పడిందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ దేశం సెక్యులర్‌గా తయారైందని చెప్పుకొచ్చారు. పాక్‌లో(Pak) ఉన్న సమస్యలకు అక్కడి ప్రభుత్వాలు, నేతలే కారణమని రెహ్మాన్ దుయ్యబట్టారు. ఇస్లామిక్ ఐడియాలజీ సిఫార్సులు అక్కడ అమలు కావడం లేదని అన్నారు. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విచారం వ్య్తం చేశారు.