ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్థాన్ నేడు తీవ్రవాద దాడులతో అతలాకుతలమైంది. ప్రతిరోజూ ఉగ్రవాదులు పోలీసులు, సైన్యం, పౌరులపై దాడులు చేస్తూనే ఉన్నారు. సోమవారం వాయువ్య పాకిస్తాన్‌లో పోలీసు వాహనంపై దాడి జరిగింది.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ డ్రగ్స్ తీసుకున్నారంటూ పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో స్వయంగా ఆయనే స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. దీంతో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్ కీలక నిర్ణయం తీసుకుంది. మాల్దీవులు దేశానికి ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేయాలని నిషాంత్ పిట్టి సోషల్ మీడియాలో తెలిపారు.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ హెచ్చరించారు. ఇది పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలగజేస్తుందని చెప్పారు.
జపాన్‌లో న్యూ ఇయర్ రోజు భయంకరమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల తర్వాత 90 ఏళ్ల వృద్ధురాలిని శిథిలాల నుండి బయటకు తీశారు.
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కోర్టుకు సమర్పించిన డాక్యూమెంట్స్ న్యాయస్థానం ఓపెన్ చేసింది. దానిలో చాలా మంది ప్రముఖుల పేర్లు ఉండడం గమనార్హం.
ప్రధానమంత్రి షేక్ హసీనా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. ఒలివర్ తన కుటుంబంతో కలిసి గ్రెనడైన్స్‌లోని బెక్వియా ద్వీపం నుంచి సెయింట్ లూసియాకు వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
కిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల తేదీని 2024 ఫిబ్రవరి 8న నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే చలి వాతావరణం, భద్రతాపరమైన కారణాలతో సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ పాకిస్థాన్ పార్లమెంట్ తీర్మానాన్ని ఆమోదించింది.
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో శీతాకాల సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు 17 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆరో తరగతి విద్యార్థి మరణించాడు, ఐదుగురు గాయపడ్డారు.
ఇటీవల కాలంలో హిందూ మహాసముద్రంలో నౌకలు హైజాక్‌కు గురవుతున్నాయి. తాజాగా హిందూ మహా సముద్రంలోని సోమాలియా తీరంలో మరో నౌక హైజాక్‌కు గురైంది.
ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై భారత్‌కు చెందిన 8 మంది నేవీ మాజీ ఉద్యోగులకు మొదటిగా మరణశిక్ష విధించింది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖతార్ అధికారులతో చర్చలు జరపగా మరణశిక్షను రద్దు చేస్తూ.. జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ జైలు శిక్షపై అప్పీలు చేసుకోవచ్చని ఇటీవల తెలిపింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ క్యాపిట్ దాడి విషయంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి పదవిని కైవసం చేసుకోవాలనుకునే ట్రంప్‌కి కొలరాడో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రముఖ సైనికాధికారి జనరల్ ఖాసీం సులేమాని స్మారక కార్యక్రమం జరుగుతుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాంబుల మోత మోగించారు. ఈ పేలుడులో వందల సంఖ్యలో మరణించారు.
అదానీ గ్రూపు అధిపతి గౌతమ్ అదానీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కేసు విచారణను సెబీ నుంచి సిట్‌కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని సుప్రీం పేర్కొంది.