Epstein Files Full List Of High-Profile People Named In Unsealed Docs
Epstein Files: లైంగిక నేరస్థుడు, ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein) గతంలో కోర్టుకు సమర్పించిన దావాను యూఎస్ కోర్ట్ తెరిచింది. 2008లో వ్యభిచారానికి పాల్పడిన నేరంలో జెఫ్రీ ఎప్స్టీన్ 2019 ఆగస్టులో US జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఆయన కోర్టుకు ఇచ్చిన డాక్యుమెంట్స్‌లో రోజుకో ప్రముఖుడి పేరు తెరపైకి వస్తుంది. ఈ జాబితాలో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, లియోనార్డో డికాప్రియో, స్టిఫెన్ హాకింగ్ లాంటి దిగ్గజుల పేర్లు ఉన్నాయి. తాజాగా వెలువడిన మూడో దఫా పత్రాల్లో హాలీవుడ్ మాజీ నిర్మాత హార్వే వైన్స్టెయిన్ పేరు బయటకొచ్చింది. అయితే ఆయన ఇప్పటికే పలు లైంగిక కేసుల్లో జైల్లో ఉన్నాడు.
వైన్స్టెయిన్ 2005లో మార్చిలో ఎప్స్టీన్ను ఓ అమ్మాయి విషయంలో చర్చించినట్లు ఆ పత్రాల్లో ఉంది. వారివురి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించినందుకు వైన్స్టెయిన్ను ఎప్స్టీన్ ఫ్రాన్స్‌లోని ఓ అపార్ట్మెంట్ నుంచి బయటకు గెంటేసినట్లు ఆ పత్రాల్లో ఉంది. ప్రముఖ పెట్టుబడిదారుడు, సంపన్నుడు జెఫ్రీ ఎప్స్టీన్ శృంగార ఫైల్స్‌లో మైనర్ బాలికలు, సినీతారలు, మోడళ్లను రంగంలో దించి, వారితో ప్రముఖులు గడిపేలా తాను నిర్వహించిన పనులు పలువురి వాంగ్మూలాలు వెల్లడిస్తున్నాయి. అలాగే బాలికలను ఎప్స్టీన్ తన అవసరాలకు ఎలా యూజ్ చేసుకునేవాడో అతని గర్ల్‌ఫ్రెండ్ ఘిస్లైన్ మాక్స్‌వెల్‌పై దాఖలైన పరువునష్టం కేసులో ఓ బాధితురాలు బయటపెట్టింది. ఇక ఆ లిస్ట్‌లో బ్రిటన్ యువరాజు ఆండ్రూ, అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ సహా మొత్తం 150 మంది ప్రముఖుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి.