దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత మైనస్ల్లోకి వెళ్తుంది. ఈక్రమంలో స్కూళ్లకు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే మరో అయిదు రోజులు సెలవులను పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Delhi: రోజురోజుకి చలితీవ్రత పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో చలితీవ్రత మైనస్ల్లోకి వెళ్తుంది. ఈక్రమంలో స్కూళ్లకు సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే మరో అయిదు రోజులు సెలవులను పొడిగించినట్లు విద్యాశాఖ మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చలితీవ్రత తగ్గకపోవడం, చల్లని గాలులు వీస్తుండటంతో నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు సెలవులను పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం అయితే సోమవారం నుంచి పాఠశాలలు తెరచుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలో అధిక చలితీవ్రత, పొగమంచు కారణంగా విజబిలిటీ చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటుంది. వీటివల్ల వాహనాలకు అంతరాయం కలుగుతుంది. అందుకే సెలవులు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.