కొరియా దేశాల పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటుచేసిన ఏజెన్సీలను కిమ్ రద్దు చేశారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్ లిమిట్ లైన్‌ను గుర్తించమన్నారు. ఉత్తర కొరియా సరిహద్దులను ఆక్రమించాలని చూస్తే యుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. అధ్యక్ష అభ్యర్థి కోసం జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తర కొరియా ఆదివారం నాడు సముద్రం వైపు అనుమానిత బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. 2024లో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రయోగాన్ని ధృవీకరించారు,
బ్రూనై రాకుమారుడు అబ్దుల్ మతీన్ ఓ సామాన్యురాలిని పెళ్లి చేసుకున్నాడు. 32 ఏళ్ల మతీన్, 29 ఏళ్ల యాంగ్ మాలియా అనిషా రోస్నాలుతో వివాహబంధంతో ఏకం అయ్యారు.
పురాతన శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో ఇటీవల ఓ నగరాన్ని కనిపెట్టారు. 2000 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉండేది. ఆ తర్వాత మరుగుపడిన పురాతన నగరాన్ని శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో కనిపెట్టారు.
కృత్రిమ మేథ సంస్థ ఓపెన్‌ఏఐ శామ్ ఆల్ట్‌మన్ తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఇద్దరూ సహజీవనం కూడా చేశారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. మరి భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
సాధారణంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీరు తాగడం మంచిది కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటినే ఎక్కువగా వాడుతుంటారు. ప్లాస్టిక్ బాటిల్‌లోని నీటిలో ఎక్కువగా ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తెలుసు.. కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో మీకు తెలుసా? ప్లాస్టిక్ వాడటం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలుసుకుందాం.
భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన అనంతరం మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ నేతలు చేసిన విచారకరమైన వ్యాఖ్యలను పట్టించుకోవద్దని ఈజ్‌మైట్రిప్‌ను కోరింది.
చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా ఇంకా కొన్నేళ్లపాటు వాయిదా వేసింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గాబ్రియేల్ అటల్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. గాబ్రియేల్ (34) ఫ్రాన్స్ ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడైన, మొదటి స్వలింగ సంపర్కుడు. ప్రస్తుతం మాక్రాన్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జపాన్‌లో మంగళవారం బలమైన భూకంపం సంభవించింది. జపాన్‌లోని హోన్షు పశ్చిమ తీరానికి సమీపంలో మధ్యాహ్నం 2:29 గంటలకు 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.
దక్షిణ కొరియా పార్లమెంట్ మంగళవారం నూతన బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం ఇక్కడ కుక్క మాంసం అమ్మడం, తినడం నేరం అవుతుంది. చాలా శతాబ్దాలుగా ఇక్కడ కుక్క మాంసం తినే సంప్రదాయం ఉంది.
హమాస్‌కు సంబంధించి ఎక్స్ ఖాతాలను బ్యాన్ చేయాలన్న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం కఠినమైందని.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎలెన్ మస్క్ వివరించారు.
ఇండోనేషియాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని తలోద్ దీవుల్లో మంగళవారం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.