జాతిపిత మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆవిష్కరించారు. శ్రీ తులసీ మందిర్ వెలుపల నూతనంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మాల్దీవులు పార్లమెంటులో మెజారిటీ కలిగి ఉన్న ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ).. దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కొత్త భార్య సనా జావెద్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సానియాకు అన్యాయం చేశావంటూ కామెంట్లలో రెచ్చిపోతున్నారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇదే ఘర్షణ కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.
ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. తమపై దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్ నౌకలపై ఒకేసారి దాడులు చేశారు. రష్యా నుంచి చమురు తీసుకొస్తున్న బ్రిటన్ నౌక మార్లిన్ లువాండా మాత్రం హౌతీల నుంచి తప్పించుకోలేకపోయింది. క్షిపణులు నేరుగా తాకడంతో ఇంధన ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి.
ఏఐ టెక్నాలజీతో కొందరు కేటుగాళ్లు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు యూట్యూబ్‌కు తలనొప్పిగా మారాయి. దీంతో 404 మీడియా పరిశోధించడంతో వెయ్యి యాడ్ వీడియోలను యూట్యూబ్ తొలగించింది.
పాకిస్థాన్ లో అత్యంత విషాదకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు వారాల్లో 200 మందికి పైగా చిన్నారులు చనిపోయారు. పాకిస్థాన్‌లో చలి ఎక్కువగా ఉండడంతో న్యుమోనియా కారణంగా ఈ మరణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్ కారోల్ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆమెకు 83 మిలియన్ డాలర్ల ( ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైమాటే) పరిహారం చెల్లించాలని కోర్టు ట్రంప్‌ను ఆదేశించింది.
ఓ విమానం టేకాఫ్ అవడం లేటైందని ఓ ప్రయాణికుడు ఏకంగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి బయటకు వెళ్లాడు. తరువాత గాల్లో ఎగిరే సమయానికి అదే డోర్ ద్వారా లోపలికి వచ్చాడు. దీనింతటికి తోటి ప్రయాణికులు కూడా మద్దతు ఇచ్చారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తే అసలు విషయం చెప్పేశాడు.
ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని ఓ అధ్యయనం తెలిపింది.
గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో నౌకలపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బ్రిటన్‌కు చెందిన ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు.
ప్రపంచంలో తొలిసారి ఓ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్షను అమలు చేయనున్నారు. అమెరికాలెని అలబామా రాష్ట్రంలో యూజీన్ స్మిత్ చార్లెస్ భార్యను హత్య కేసులో దశాబ్దాలుగా జైలు జీవితం గడుపుతున్న అతనికి ఈ తరహాలో మరణశిక్షను అమలు చేయనున్నారు.
పాకిస్థాన్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దాదాపు ప్రతిరోజూ పాకిస్తాన్ నుండి వింత వార్తలు వెలువడుతున్నాయి.
సౌదీ అరేబియాలో మొట్ట మొదటి సారిగా అధికారకంగా లిక్కర్ దుకాణాన్ని ప్రారంభించనున్నారు. ఆ దేశ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నాయి.
ఇల్లు కొనండి..భార్యను ఉచితంగా పొందండి...అంటూ చైనాకు సంబంధించిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన చేసింది. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు భారీగా జరిమానా విధించింది.