పాకిస్థాన్‌లో ఎన్నికలకు ఒకరోజు ముందు బలూచిస్థాన్‌లోని రెండు ప్రాంతాల్లో పేలుడు సంభవించింది. ఇందులో మొత్తం 22 మంది మరణించినట్లు సమాచారం.
చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారని కార్యాలయం తెలిపింది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు ఉండగా.. అందులో పినేరా చనిపోగా మిగతా వాళ్లు గాయాలతో బయటపడ్డారు.
కలరాతో జాంబియా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వందల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వేలల్లో ఈ వ్యాధి బారిన పడి ఆఫ్రికన్ ప్రజలు ప్రాణ భయంతో వణికిిపోతున్నారు. భారత్ ఆ దేశ పౌరుల కోసం 3.5 టన్నుల మానవతా సాయం పంపింది.
బ్రిటన్ రాజు చార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని బకింగ్ హాం ప్యాలెస్ వెల్లడించింది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబం సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
చిలీ దేశం అడవి మంటలతో కాలిపోతోంది. దక్షిణ అమెరికా ఖండంలోని ఈ దేశంలో, అడవి మంటల కారణంగా అనేక ఇళ్లు, కార్లు, దుకాణాలు బూడిదయ్యాయి.
క్యాండిడా ఆరిస్ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలో వాషింగ్టన్‌లో కనీసం నలుగురికి ఈ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. అరుదైన ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, ఇది ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది.
భారత్, రష్యా వ్యూహాత్మక సంబంధాలపై పాకిస్థాన్ నిఘా పెట్టింది. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో ఐఎస్‌ఐ తన గూఢచారిని నియమించింది. తాజాగా అతనిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మేరఠ్‌లో అరెస్టు చేశారు.
పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలం అయింది. కరాచీ సహా పలు నగరాల్లో రాత్రంతా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు కురువడంతో వరదలు వచ్చే ప్రమాదం నెలకొంది.
దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఇప్పటివరకు 46 మంది మృతి చెందగా.. వేలాది మందికి గాయాలు అయ్యాయి.
భారత్‌ను వ్యతిరేకిస్తున్న మాల్దీవులకు సాయం చేసేందుకు పాకిస్థాన్ ముందుకు వచ్చింది. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కకర్ మాల్దీవుల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇళ్లు మారారు. లాస్ ఏంజెలిస్ నగరంలో ఉంటున్న వారి విలాసవంతమైన భవంతిని ఖాళీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
భారత సంతతికి చెందిన దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దోషులుగా తేలడంతో బ్రిటన్ కోర్టు ఈ దంపతులకు 33 ఏళ్లు జైలు శిక్ష విధించింది.
సోమాలియా దుండగుల దాడి నుంచి పాకిస్థాన్ నౌకను ఐఎన్‌ఎస్ యుద్ధనౌక సుమిత్రా రక్షించింది. ఇందులో ప్రయాణిస్తున్న 19 మంది పాకిస్థానీయులను కాపాడింది. అయితే సోమాలియా సముద్రపు దొంగల నుంచి తమను రక్షించినందుకు పాకిస్థాన్, ఇరాన్ సిబ్బంది భారత నావికాదళానికి ధన్యవాదాలు తెలిపారు.
ఓ ట్రక్కు, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
అధికారిక రహస్యాలను బయటపెట్టిన కేసులో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు సైఫర్ కేసులో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.