»Cholera Outbreak In Zambia India Showing Humanity
Zambia: జాంబియాలో కలరా విజృంభణ.. మానవతను చాటుకున్న భారత్
కలరాతో జాంబియా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వందల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వేలల్లో ఈ వ్యాధి బారిన పడి ఆఫ్రికన్ ప్రజలు ప్రాణ భయంతో వణికిిపోతున్నారు. భారత్ ఆ దేశ పౌరుల కోసం 3.5 టన్నుల మానవతా సాయం పంపింది.
Cholera outbreak in Zambia. India showing humanity
Zambia: ఆఫ్రికన్ దేశం జాంబియా ప్రజలు(Zambia) కలరా(Cholera )తో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్యసౌకర్యాలు అందక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మునుపెన్నడూ ఎరుగని విధంగా ఈ కలరా దేశాన్ని కుదిపేస్తుంది. ఈ అతిసార వ్యాధి మూలాన వేలల్లో రోగులు, వందల్లో మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ దేశాలు సైతం నివ్వేర పోతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్(India) జాంబియాకు అపన్న హస్తం అందించింది. క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యత్రాలను సాయంగా పంపింది. ఆ దేశానికి 3.5 టన్నుల మానవతా సాయం పంపిందని అధికారులు వెల్లడించారు.
అంతర్జాతీయ కథనాల ప్రకారం.. ఈ విపత్తు పెద్ద ఎత్తున ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం జాంబియా వైద్యపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అని వెల్లడించాయి. ఈ చిన్న దేశంలో ఈ మహమ్మారి కారణంగా అక్టోబరు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికిపైగా ఈ రోగానికి చిక్కారు. దేశంలోని పది ప్రావిన్సులలో తొమ్మిది ప్రావిన్సులకు కలరా వ్యాపించింది. స్టేడియాలు, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల్లో వైద్యం అందిస్తున్నారు. మాస్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. రిటైర్డ్ అయిన వైద్యులు సైతం రంగంలోకిి దిగి రోగులకు సేవలనందిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సురక్షీత నీటికిి ఆటంకంగా మారాయి. సాధారణంగా కలరా మరణాల రేటు 1 శాతంగా మాత్రమే ఉంటుంది కానీ ఆఫ్రికాలో అందుకు భిన్నంగా ఇప్పటికే 4 శాతానికి చేరిందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ అందించిన సాయం వారికి ఎంతో తొడ్పడుతుందని వైద్యనిపుణులు భావిస్తున్నారు.