ఓ యువకుడు ఐదుగురి అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఐదుగురూ ఒకేసారి గర్భవతులు కావడంతో వారిని ఓ చోటుకు చేర్చి బేబీ షవర్ వేడుక నిర్వహించారు. నెట్టింగ ఈ ఘటన వైరల్ అవుతోంది.
రష్యా విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ఉక్రెయిన్ సైనికులు 65 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాద ఘటనపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సైనికులపై రష్యా ప్రతీకార చర్యలు చేపడుతోందని ఫైర్ అయ్యింది.
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీకి ఒక వింత ప్రశ్న ఎదురైంది. ప్రచారంలో భాగంగా న్యూ హాంప్ షైర్‌లో వేదిక కింద ఉన్న ఒక ట్రంప్ మద్దతు దారు తనను పెళ్లి చేసుకుంటావా అని నిక్కీ హేలీని అడిగాడు. దాంతో అందరూ ఒక్క క్షణం షాక్ అయ్యారు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం గోల్డెన్ వీసా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులకు కీలకమైన గోల్డెన్ వీసాల జారీని రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది.
ప్రపంచంలో అతి ఎక్కువ జనభాగా అవతరించిన భారతదేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం మంచిది కాదని టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. దీనిపై అంతర్జాతీయంగా చర్చ సాగుతోంది.
చైనాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. చైనాలోని దక్షిణ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో భూమి కంపించింది. భూఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ తెలిపింది.
ఓ పక్క దేశంలో రాములోరి ప్రాణ ప్రతిష్టకు యావత్ ప్రపంచం సిద్ధమవుతున్న వేళ చైనాలో పెను విపత్తు వచ్చింది. ఇక్కడ, నైరుతి చైనాలోని పర్వతాలలో కొండచరియలు విరిగిపడటంతో 44 మంది సమాధి అయ్యారు.
మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాస భారతీయులు భజనలు, కీర్తనలతో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ శీతాకాలపు తుపాను కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వాతావరణం సరిగ్గా లేక సుమారుగా 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
సిరియా, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిన్న వైమానిక దాడులు జరిపింది. ఇందులో ఇరాన్ సైనిక సలహాదారులను, హెజ్‌బొల్లా కమాండర్లను హతమార్చింది. కొందరు చనిపోయగా.. పలువురు గాయాలు పాలయ్యారు.
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రాథమిక బోర్డింగ్ పాఠశాలలోని వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 13 మంది మరణించారు.
థాయ్‌లాండ్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు కారణంగా 20 మంది మరణించినట్లు సమాచారం. సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని రెస్క్యూ వర్కర్ చెప్పారు.
ప్రపంచం ఇప్పుడిప్పుడే కరోనా భయం నుంచి కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో మరో వార్త ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కొవిడ్-19 ను చైనాలో తయారు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఇప్పటి వరకు తెలియలేదు. తాజాగా దీనికి మించిన ప్రమాదకరమైన వైరస్‌ను చైనా తయారు చేస్తుందని అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి.
అమెరికాలోని మసాచుసెట్స్‌లోని మారుమూల అటవీ ప్రాంతంలో విమానం కూలిపోవడంతో ఫ్లయింగ్ ట్రైనింగ్ స్కూల్ యజమాని, విద్యార్థి పైలట్ సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.
ఇరాక్‌లోని అర్బిల్‌లోని యుఎస్ కాన్సులేట్ సమీపంలో అనేక పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGS) బాధ్యత వహించింది.