అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ శీతాకాలపు తుపాను కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వాతావరణం సరిగ్గా లేక సుమారుగా 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
America: అగ్రరాజ్యమైన అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. గత వారం రోజులకుపైగా అక్కడ భారీగా ఎడతెరిపిలేని మంచు కురుస్తోంది. రహదారులపై దట్టమైన మంచు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ శీతాకాలపు తుపాను కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. వాతావరణం సరిగ్గా లేక సుమారుగా 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మక్కా తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా అయిదుగురు మహిళలు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
మంచు తుపాను వల్లే మరణాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. పసిఫిక్ నార్త్‌వెస్ట్, రాకీ పర్వతాలు, న్యూ ఇంగ్లాండ్, పశ్చిమ న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. న్యూయార్క్‌లోని బఫెలో సమీపంలో ఐదు రోజుల వ్యవధిలో సుమారు 75 అంగుళాల (1.9 మీటర్లు) మంచు కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.మంచు తుఫాను కారణంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పాఠశాలను అధికారులు మూసివేశారు. ఈ మంచు తుఫాను ప్రభావం విద్యుత్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
తుఫాను వల్ల లక్షలాది మంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ఒక్క ఒరెగాన్ రాష్ట్రంలోనే 75 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు చలిగాలుల తీవ్రత కారణంగా 1.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచు తుపాను కారణంగా వెయ్యికిపైగా విమానాలు రద్దయ్యాయి. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి.