Saudi Arabia: సౌదీ అరేబియాలో తెరచుకోనున్న తొలి మద్యం దుకాణం
సౌదీ అరేబియాలో మొట్ట మొదటి సారిగా అధికారకంగా లిక్కర్ దుకాణాన్ని ప్రారంభించనున్నారు. ఆ దేశ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నాయి.
Saudi Arabia: సౌదీ అరేబియా(Saudi Arabia) అనగానే అక్కడ ఉంటే కట్టుదిట్టమైన కట్టు బాట్లు గుర్తుకు వస్తాయి. తాజాగా మారుతున్న కాలానికి అనుగుణంగా అక్కడ కూడా కొన్ని మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సౌదీలో ఒక్క మద్యం దుకాణం కూడా ఉండేది కాదు, ఎందుకంటే ఇస్లామీలు మద్యం తాగడం ఒక పాపంగా భావిస్తారు. అయితే సౌదీలో కేవలం ముస్లీంలు మాత్రమే కాదు ఇతర మతస్తులు కూడా ఉంటారు. ఎక్కువగా వలస వెళ్లిన వారు ఉంటారు. వారికోసం మొట్ట మొదటి సారిగా అధికారికంగా మద్యం దుకాణం ఓపెన్ చేయడానికి ఆ దేశ రాజు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అనుమతించారు. సౌదీలో 1952 నుంచే మద్యంపై కఠిన నిబంధనలు ఉన్నాయి.
మద్యం సేవించడం ఇస్లాంకు వ్యతిరేకం. అందుకే ఇప్పటి వరకు అక్కడ లిక్కర్ మార్ట్ లేదు. ఈ క్రమంలో ప్రారంభం కానున్న మద్యం దుకాణం ముస్లిమేతరులకు మాత్రమే. అయితే దీనికి ముందు మద్యం వినియోగదారులకు డిప్లో అనే యాప్ అందుబాటులో ఉండేది. అందులో వారి డిటైల్స్ నమోదు చేసుకొని మద్యం తీసుకునే వారు. అంతే కాదు మద్యం అమ్మడం అనుమతి లేకపోవడంతో బ్లాక్ మార్కెట్ విస్తృతస్థాయిలో పెరిగింది. అందుకే అక్కడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు షాప్స్ ఓపెన్ అయ్యాయి. దీనిలో 21 ఏళ్ల లోపువారిని అనుమతి లేదు. ఫొటోగ్రఫీపైనా నిషేధం ఉంది. కేవలం ముస్లిమేతరులే స్టోర్లోకి అనుమతి ఉంది.