సౌదీ అరేబియా కలల ప్రాజెక్టు నియోమ్‌కు ఎవరు అడ్డుపడిన ప్రాణాలతో విడిచిపెట్టవద్దని ఆ దేశం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే ఎవరిని కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం.
Neom: Don't leave your life if the project gets stuck!
Neom: సౌదీ అరేబియా కలల ప్రాజెక్టు నియోమ్‌కు ఎవరు అడ్డుపడిన ప్రాణాలతో విడిచిపెట్టవద్దని ఆ దేశం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే ఎవరిని కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కర్నల్ రభిహ్ ఎలెన్జీ వెల్లడించినట్లు సమాచారం. నియోమ్ స్మార్ట్ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ అరేబియా ఎంతో కఠినంగా ఉంటుందట. పర్యాటక ప్రదేశం, గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దలా నియోమ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును చేపట్టారు. దీనికి 500 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఎర్ర సముద్ర తీరంలో మొత్తం 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లలను నిర్మించనున్నారు. ఇందులో ఫ్లోటింగ్ పోర్ట్, స్కై రిసార్ట్లు, సర్వాట్ పర్వతాలపై నిర్మాణాలు, మిర్రర్డ్ సిటీ వంటివి ఉన్నాయి.
ది లైన్ ప్రాజెక్టును 100 మీటర్ల ఎత్తులో 200 మీటర్ల వెడల్పుతో 170 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 90 లక్షల మంది నివసించవచ్చట. ప్రజలు కేవలం ఐదు నిమిషాల పాటు నడిస్తే వాళ్లకి నిత్యావసరాలు దొరుకుతాయి. కృత్రిమ మేధతో అందే సేవలు ఇక్కడ లభిస్తాయి. ఈ నిర్మాణంలో అద్దాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు భూసేకరణ కావాలి. దీని కోసం సౌదీ అరేబియా మూడు గ్రామాలను 2020లో ఖాళీ చేయించాయి. అయితే అబ్దుల్ రహీం అల్ హువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానీయలేదు. దీంతో అతడిని దళాలు కాల్చేశాయి. ఆ తర్వాత మొత్తం 47 మంది గ్రామస్థులను ఉగ్రనేరాలపై అరెస్టు చేశారు.