»Saudi Arabia Children Absent From School Parents Will Be Punished
Saudi-Arabia: అక్కడ పిల్లలు స్కూల్ వెళ్లకపోతే, పేరెంట్స్ జైలుకే..!
పిల్లలు స్కూల్‌కి అకారణంగా డుమ్మా కొట్టడంతో సౌదీ అరేబియా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 20 రోజులు.. అంతకన్నా ఎక్కువ రోజులు స్కూల్‌కి రాకుంటే ఆ పేరంట్స్‌ను జైలుకు పంపిస్తామని స్పష్టంచేసింది.
Saudi-Arabia:సోమవారం వస్తే పిల్లలు బద్ధకంగా మారతారు. పాఠశాలకు వెళ్లడానికి సముఖత చూపించరు. ఎలా స్కూల్‌కి బంక్ కొట్టాలా అని ప్లాన్ వేస్తూ ఉంటారు. కొందరు పిల్లలు కడుపునొప్పి, జ్వరం వంటి సాకులతో పాఠశాలకు గైర్హాజరు అవుతున్నారు. పిల్లలను ఒప్పించడంలో విసిగి వేసారిపోయే ఒక్క రోజు స్కూల్ వెళ్లకపోతే ఏం కాదులేనని ఊరుకుంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే తంతు ఇదే.
భారతదేశంలో ప్రతీ సంవత్సరం పిల్లలను పాఠశాలకు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్- జూలై నెలలో పాఠశాలకు తిరిగి వచ్చేలా వారిని ఒప్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలు చదువులో వెనుకబడితే కష్టం. ప్రతి రోజు తప్పకుండా పాఠశాలకు వెళితే పిల్లల అభివృద్ధికి సాధ్యం అవుతుంది. దీన్ని సౌదీ అరేబియా సీరియస్‌గా తీసుకుంది. సౌదీ అరేబియాలో బడి మానేసిన పిల్లలను కాకుండా తల్లిదండ్రులను శిక్షించాలని నిర్ణయించారు.
నిబంధన ఏమిటి?: ఒక పిల్లవాడు అకారణంగా 20 రోజులకు మించి పాఠశాలకు గైర్హాజరు కాకూడదు. పిల్లలు గైర్హాజరైతే తల్లిదండ్రులకు జైలు శిక్ష విధిస్తారు. పిల్లల విషయంలో పేరంట్స్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే సౌదీ అరేబియా చట్టం ప్రకారం తల్లిదండ్రులకు శిక్ష పడుతుంది.
విద్య నాణ్యతను మెరుగుపరచడానికి విద్యా మంత్రిత్వ శాఖ అనేక కఠినమైన నిబంధనలను రూపొందించింది. ఇది దానిలో చేర్చారు. నివేదిక ప్రకారం, సరైన కారణం లేకుండా పిల్లలు వరుసగా 20 రోజులకు మించి పాఠశాలకు గైర్హాజరు కాకూడదు. పిల్లలు గైర్హాజరవుతారని తల్లిదండ్రులు ముందుగానే తెలియజేయాలి. దానికి తగిన కారణం చెప్పాలి. లేకుంటే తల్లిదండ్రులు జైలులో కటకటాలు లెక్కించేందుకు సిద్ధంగా ఉండాలి. దేశ చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా ఈ చర్య తీసుకోవచ్చు. విచారణ అనంతరం కేసును కోర్టుకు బదిలీ చేస్తారు. తల్లిదండ్రులు దోషులుగా తేలితే , కోర్టు నోటీసులు తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి శిక్ష విధిస్తారు. న్యాయమూర్తులకు సహేతుకమైన కాలం వరకు తల్లిదండ్రులను జైలుకు పంపే అధికారం ఉంది.
చర్యలు తీసుకుంటాం:విద్యార్థికి ఎలాంటి నోటీసు లేకుండా 20 రోజులకు పైగా పాఠశాలకు గైర్హాజరైతే.. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముందుగా సంబంధిత విద్యాశాఖకు విషయాన్ని నివేదించాలి. అప్పుడు విచారణ ప్రారంభం అవుతుంది. విద్యా మంత్రిత్వ శాఖ కేసును టేకప్ చేస్తుంది. విద్యార్థి పాఠశాలకు గైర్హాజరు కావడానికి గల కారణాలపై సాక్ష్యం చెప్పాలని కుటుంబ సంరక్షణ విభాగం విద్యార్థిని కోరుతుందని, అవసరమైతే కోర్టులో కేసు పెడతామన్నారు. లేకుంటే అక్కడే పరిష్కారం అవుతుంది.
మారిన సౌదీ అరేబియా విద్యా విధానం:సౌదీ అరేబియాలోని పాఠశాలలకు రెండు నెలల సెలవులు ఇచ్చారు. వేసవి సెలవుల తర్వాత 6 మిలియన్లకు పైగా విద్యార్థులు ఇప్పుడు పాఠశాలకు తిరిగి వచ్చారు. ఈ లోగా సౌదీ అరేబియా తన విద్యా విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చింది. సెకండరీ స్కూల్ పాఠ్యాంశాల్లో ఎర్త్ సైన్స్, స్పేస్, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి కొత్త సబ్జెక్టులకు పచ్చ జెండా ఊపింది.