ఎలాన్ మస్క్‌పై భారత సంతతికి చెంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రామస్వామి బరిలో దిగారు.
Republican candidate Vivek Ramaswamy's interesting comments on Elon Musk
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష(US President) ఎన్నికలు వచ్చే ఏడాది జరుగునున్నాయి. భారత సంతతికి చెందిన అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను ప్రస్తుతం రిపబ్లిక్ పార్టీ (Republic Party) అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. అయోవాలోని టౌన్హాల్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా గెలిస్తే- టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తానని అన్నారు. గతేడాది మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దాన్ని ఎక్స్ అనే పేరుతో సమర్థవంతంగా నడుపుతున్నారని, తాను కూడా అమెరికా ప్రభుత్వాన్ని అలాగే నడిపిస్తాడని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ఎలాన్ మస్క్.. రామస్వామిని నమ్మదగిన అభ్యర్థిగా ప్రకటించారు.
38ఏళ్ల వివేక్ రామస్వామి విజయవంతమైన అమెరికన్ వ్యాపారవేత్త. 2014లో రోవాంట్ సైన్సెస్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీని స్థాపించాడు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫిబ్రవరి 2023లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కొవిడ్-ఇజం, క్లైమేట్-ఇజం, జెండర్ ఐడియాలజీ వంటి కొత్త సెక్యులర్ మతాలతో దేశం సంక్షోభంలో ఉందనే వాదనలతో రామస్వామి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ పాలన విమర్శకుడిగా మంచి పేరుంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆగష్టు 2023లో రామస్వామి నికర ఆస్తుల విలు $950 మిలియన్ (దాదాపు రూ. 7900 కోట్లు) కోట్లుగా తెలిపింది.