»Prashanth Neel Ntr A Powerful Title For Ntr Prashanth Neel
Prasanth Neel-NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కోసం పవర్ ఫుల్ టైటిల్?
కెజియఫ్, సలార్ సినిమాలు ఒక ఎత్తైతే.. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా మరో ఎత్తు అనేలా ఉండబోతోంది. అసలు కెజియఫ్, సలార్ కలిపితే ఎలా ఉంటుందో.. ఎన్టీఆర్ 31 అలా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే పవర్ ఫుల్ టైటిల్స్ వినిపిస్తున్నాయి.
Prashanth Neel-NTR: A powerful title for NTR, Prashanth Neel?
Prasanth Neel-NTR: ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ చేయబోయేది తన డ్రీమ్ ప్రాజెక్ట్. పైగా తన అభిమాన హీరో అవడంతో.. ఆ ఎలివేషన్ ఎలా ఉంటుందో.. ఊహకు కూడా అందకుండా ఉంది. ఖచ్చితంగా.. ఎన్టీఆర్‌ను ఇంతకుముందు ఎన్నడూ చూడని మాస్ అవతారంలో ప్రజెంట్ చేయడం గ్యారెంటీ. సలార్ 2 అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కుదిరితే ఈ ఏడాది అక్టోబర్‌లోనే షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే.. ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం చర్చ జరుగుతునే ఉంది. గతంలో న్యూక్లియర్, మిస్సైల్ అనే టైటిల్స్ వినిపించాయి.
ఈ టైటిల్స్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు రిజిష్టర్ కూడా చేయించరానే టాక్ ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి.. నూక్లియర్, మిస్సైల్ లాంటి టైటిల్స్ అయితే, అన్ని భాషలకి పర్ఫెక్ట్గా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. లేటెస్ట్గా.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్నట్లు సమాచారం.
ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఇప్పటి వరకు వినిపించిన టైటిల్స్ అన్నీ కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి. సినిమాలో ఎన్టీఆర్ హీరోయిజం, ఎలివేషన్స్‌కు ఇలాంటి టైటిల్స్ అదిరిపోతాయి. కానీ అసలు ప్రశాంత్ నీల్ మైండ్‌లో ఏముందనేది ఎవరికీ తెలియదు. కాబట్టి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. మే 20న ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆరోజు యంగ్ టైగర్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి.