Russia-Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం గురించి తెలిసిందే. ఇదే ఘర్షణ కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. అమెరికా సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో ఏమైనా జరగవచ్చని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ఇదే విషయం జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్కు కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. మరో ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందని జెలెన్స్కీ అన్నారు.
రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను అర్థం చేసుకోగలనని జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమైన సమయంలో జర్మనీ తన వంతు పాత్ర పోషించలేదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ కోసం ఇతర ఐరోపా దేశాలతో కలిసి పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని కోరారు.